మెరకముడిదాం మండలంలో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఏఈ దివాకర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలులకు అనేక వైర్లు తెగినప్పటికి ఏఈ దివాకర్, లైనమన్ వెంకటనాయుడు తమ సిబ్బందితో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు లైన్ సరిచేస్తూ విద్యుత్ అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.