వెదుళ్లవలసలో కొట్టుకుపోయిన స్మశాన వాటికకు వెళ్లే వంతెన .

గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామంలో స్మశాన వాటికకు వెళ్లే వంతెన అల్పపీడన ప్రభావంతో కొట్టుకుపోయింది. ఈ విషయమై బిజెపి నాయకుడు మన్నెపురి శ్రీనివాసరావు అధికారుల దృష్టికి శుక్రవారం తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మార్వో బంగారు రాజు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఆర్ ఐ, ఏపీవో, పంచాయతీ సెక్రెటరీ తదితర అధికారులు వచ్చి పరిశీలించారు. ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్

✕
✕