విజయనగరం, చీపురుపల్లిలో జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను ఆమె పరిశీలించారు. భోజనం నాణ్యతపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, ఇకపై ప్రతి పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రమైన, పోషక విలువలు కలిగిన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.