గజపతినగరంలో వైభవంగా పందిరిరాట కార్యక్రమం

గజపతినగరంలోని కోనేటిగట్టు వద్ద సోమవారం దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పందిరి రాట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. యువత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సన్యాసినాయుడు రాటవేశారు. అర్చకులు నగేష్ వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 11వ తేదీన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕