మరడాం జడ్పీహెచ్ హైస్కూల్ లో ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు

దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో గురువారం జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికలకు స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాట్లు జరిగాయి. మరడాం పంచాయతీ పరిధిలో మర్రి వలస, కొండ కొత్తవలస, అదనంగా తడిందరవలస ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3000 ఓట్లకు పది వార్డులకు గాను మూడు బూత్లు ఏర్పాటు చేశారు. స్థానిక కూటమి ఎంపీటీసీ అభ్యర్థి కర్రీ రమణమ్మ, వైసీపీ అభ్యర్థి నిద్ర బింగి మంగమ్మకు పోటీ నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕