మెంటాడ మండలం జయతి గ్రామంలో గురువారం నూతన విక్సత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజావికా మిషన్ గ్రామీణ పథకం ప్రసార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు, 125 రోజుల ఉపాధి హామీ, గ్రామాభివృద్ధికి చేపట్ట పనుల గురించి అవగాహన కల్పించారు. జయతి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ నీలావతి ఈశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.