తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ

గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలో బుధవారం ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు శ్యామలత ఆధ్వర్యంలో తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమం జరిగింది. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు అందించాలని, గర్భిణీలు, బాలింతలు తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా మహిళలకు ప్రతిజ్ఞ చేయించి, నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి కార్యకర్తలు, మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్