జయతి జిల్లా పరిషత్ ఎస్ఎంసి చైర్మన్ గా భవిరెడ్డి నూకలక్ష్మి

మెంటాడ మండలం జయతి జిల్లా పరిషత్ స్కూల్ ఎస్ఎంసి ఎన్నిక మంగళవారం నిర్వహించారు. 6-10 తరగతుల ఎస్ఎంసి నెంబర్లు 15 మంది ఎన్నుకోవడం జరిగిందని అందులో చైర్మన్ గా భవిరెడ్డి నూకలక్ష్మి , వైస్ చైర్మన్ గా బల్ల జట్లమ్మ కు మద్దతు పలికారని స్కూల్ ప్రధానోపాధ్యాయులు వైకుంఠం లక్షణ తెలిపారు. ఈ ఎస్ఎంసి ఎలక్షన్ గెలవడంతో గ్రామస్తులు, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕