జక్కువులో నకిలీ విత్తనాల కలకలం

విజయనగరం మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు నమ్మి 300 ఎకరాల్లో వేస్తే, 60 శాతం పంట కేళీలు రావడంతో సుమారు 70 మంది రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నట్టేట మునిగామని గగ్గోలు పెడుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జక్కువ గ్రామానికి చెందిన సుమారు డెబ్భై మంది రైతులు స్థానిక రైతు సేవా కేంద్రంలో కొనుగోలు చేసిన 11: 21 రకం ప్రభుత్వ సబ్సిడీ వరి విత్తనాలతో 300 ఎకరాలు సాగు చేశారు. పంట మొలకెత్తిన కొద్ది రోజులకే అసలు విషయం బయటపడింది. దుబ్బులు పెరిగాక అందులో కొన్ని దుబ్బులకి గింజ రావడం లేదు, 60 శాతం దుబ్బుకి గింజలు లేకపోవడం రైతులు కేలీలుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్

✕
✕