గజపతినగరం పరిధిలోని బొండపల్లి మండలం ఒంపల్లి గ్రామంలో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో రైతులకు పంటల బీమాపై అవగాహన కల్పించారు. ఎకరాకు రూ. 200 ప్రీమియంను ఆగస్టు 15లోపు చెల్లించి స్వీయ ప్రకటన సమర్పించాలని సూచించారు. లోన్ లేని రైతులు సీఎస్సీ కేంద్రాల్లో బీమా నమోదు చేసుకోవాలని, ఎల్‌నినో దృష్ట్యా బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని, ఎకరాకు రూ. 40 వేల వరకు బీమా రక్షణ లభిస్తుందని AO రేఖ, సర్వరత్నం తెలిపారు.