గజపతినగరం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సులో, ఏఎంసీ చైర్మన్ గోపాల రాజు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. ఏవో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరి స్థానంలో మెట్ట పంటలతో పాటు పాడి పరిశ్రమ, కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకం వంటివి రైతులకు ఆదాయ వనరులుగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ గాలి శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ ఏడి తదితర అధికారులు పాల్గొన్నారు.