గజపతినగరం: ఘనంగా మంత్రి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం గజపతినగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయనకు నియోజకవర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతూ, గజమాలతో సత్కరించి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తమ అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ కేక కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పార్టీని ముందుండి నడిపిస్తున్న కార్యకర్తలకు పార్టీ తరఫున అండగా ఉంటానని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్