గజపతినగరం: రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం

గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు జి.ఆర్.పి హెడ్ కానిస్టేబుల్ బి. ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. మృతుడి వివరాలు తెలియలేదని, అతడు నీలం రంగు జీన్ ప్యాంటు, తెలుపు రంగు షర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. రైలు ఢీకొనడం లేదా రైలు నుండి జారిపోవడం కారణంగా మృతిచెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్