గజపతినగరం ఆశీలు పాట వాయిదా

గజపతినగరం పంచాయతీ రోజువారి మార్కెట్ ఆశీలు పాట శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వేలం పాట వాయిదా పడింది. ఈ వేలం పాటలో ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.3,08,660 కాగా సంచాన పైడిరాజు, అప్పలనాయుడుల మధ్య పోటీలో పైడిరాజు రూ.63వేలకు పాడారు. ప్రభుత్వ ధర కన్నా తక్కువ రావడంతో జూలై మూడో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఈవో పి ఆర్ డి జనార్దన రావు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్