గజపతినగరం: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గజపతినగరం పంచాయతీ వార్డు సభ్యురాలు యడ్ల లక్ష్మి కోరారు. సోమవారం గజపతినగరంలోని జయంతి కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని వర్గాల వారికి సమానంగా రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్