ఒరిస్సా రాష్ట్రం సమితి అలమండ కు చెందిన నాని (20) ఆదివారం తన స్నేహితులతో కలసి బైక్ పై తాటిపూడి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో గింజేరు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో నాని అక్కడికక్కడే మృతి చెందగా, తన స్నేహితుడు వంశీకృష్ణ కు గాయాలు కావడంతో 108 లో జిల్లా ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. మృతుడు తండ్రి రాము ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.