ఆర్యవైశ్య సంఘం గజపతినగరం నూతన అధ్యక్షులుగా గుప్తా ఎన్నిక

విజయనగరంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గజపతినగరం నూతన మండల శాఖ అధ్యక్షునిగా కె ఏ ఎస్ ఎస్ గుప్తా, కార్యదర్శిగా వరద అప్పలరాజు, కోశాధికారిగా ఆరిశెట్టి ఏడుకొండలు ఎన్నికయ్యారు. అలాగే యువ అధ్యక్షునిగా ఆరిశెట్టి భాస్కరరావు, కార్యదర్శిగా వరద శ్రీనివాసరావు, కోశాధికారిగా సబ్బిశెట్టి శ్రీనులు ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీలు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕