హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ బెల్లాన రవికి సన్మానం

హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవిని గజపతినగరం బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా, గజపతినగరం కోర్టు అదనపు భవనం నిర్మాణానికి కృషి చేస్తానని బెల్లాన రవి హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేస్తామని ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో హామీ లభించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ ఎల్. రాంబాబు, కార్యదర్శి సాయి సురేష్, ట్రెజరర్ రమేష్ రాజు, ఇతర న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్