త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పోలింగ్ కేంద్రాలలో మంచినీరు, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ సూచించారు. ఆయన మంగళవారం సాయంత్రం విజయనగరం, గజపతినగరం పరిధిలోని ఎం వెంకటాపురం గ్రామంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ భరత్ కుమార్, ఎన్నికల డిటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.