జామి మండలం తాండ్రంగి గ్రామంలో కుమ్మరి వీధిలోని ప్రజలు దాహం కేకలతో విలవిలలాడుతున్న సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాదిత ప్రజలు మాట్లాడుతూ. చాలా రోజుల నుండి మా వీధికి నీరు అందడం లేదని కేవలం రెండు బిందులకు వచ్చే విధంగా మాత్రమే సప్లై చేస్తున్నారని అక్కడ ప్రజలు వాపోతున్నారు. పూర్తిస్థాయిలో దీనిపై అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నారు.