విజయనగరం, గజపతినగరంలో ఆదివారం జరిగిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ దివంగత రాష్ట్ర అధికారి ప్రతినిధి ఉప్పల ఈశ్వరరావు సంతాప సభలో ఆయన ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర డైరెక్టర్ తవ్వా మోహనరావు అన్నారు. మాజీ జిల్లా అధ్యక్షులు పూసర్ల మోహనరావు మాట్లాడుతూ ఉప్పల ఆర్యవైశ్యులను ఏకతాటిపైకి తెచ్చి చైతన్యం నింపారని కొనియాడారు. ఈ సందర్భంగా ఉప్పల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సభలో జిల్లా అధ్యక్షులు బొండా రమేష్, మండల నాయకులు కే ఏ ఎస్ ఎస్ గుప్త తదితరులు పాల్గొన్నారు.