దత్తిరాజేరు మండలం పిలింగాలవలస గ్రామంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో ఇదే గ్రామానికి చెందిన గండి కృష్ణ, గండి సింహాచలం, కడేల ఏసేబులకు చెందిన పశువుల శాలతో పాటుగా గడ్డివాములు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న బాడంగి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా అగ్ని ప్రమాదంలో సంభవించిన ఆస్తి నష్టం పై ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.