విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం కోమటిపల్లి - మరడాం గ్రామాల మధ్య మంగళవారం జాతీయ రహదారి 26 పై రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో బీహార్ కు చెందిన రవీంద్ర యాదవ్ అనే డ్రైవర్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాల సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ప్రయోగమూర్తి చెప్పారు.