గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని గంట్యాడ మండల కేంద్రంలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం ఓటింగ్ సరళి ఎలా సాగుతోందనే విషయమై అక్కడ ఉన్న సిబ్బందిని మరియు ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕