గజపతినగరం మద్యం షాపుల దరఖాస్తులపై అధికారుల పరిశీలన

గజపతినగరంలోని ప్రోహేబిషన్ ఎక్సైజ్ కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం డిప్యూటీ కమిషనర్ వై. శ్రీనివాస చౌదరి, జిల్లా ఎక్సైజ్ అధికారి బి. శ్రీనాథుడులు సందర్శించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 30 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గజపతినగరం సర్కిల్ పరిధిలో 16 మద్యం షాపులకు 13 షాపుల లైసెన్సులు రెన్యువల్ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీ. ఐ జనార్దనరావు, ఎస్సై నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕