గజపతినగరం జడ్పిటిసి గార తౌడు చేతులమీదుగా గురువారం గజపతినగరం లోని ఉమా రామలింగేశ్వర ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పురిటిపెంట న్యూకాలనీకి చెందిన ఇనుముల రాజు కుటుంబ సభ్యులు లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ ధర్మకర్త కందుల చిన్నయ్యస్వామి కి అందజేశారు. దివంగత ఇనుముల శ్రీరాములు, వరుపుల నాగేశ్వరరావు, లక్ష్మి, వినోద్ జ్ఞాపకార్థం ఈ విరాళం అందించారు.