ఆర్థిక లావాదేవీల దోపిడీదారులే వెళ్లిపోతారు

ఆర్థిక లావాదేవీల దోపిడీదారులు పార్టీ నుంచి వెళ్లిపోతారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో వైసిపి గజపతినగరం నియోజకవర్గస్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పర్యవేక్షణలో జరిగింది. ఒకరిద్దరూ వెళ్లిపోతే 100 మంది వస్తారని చెప్పారు. కష్టంతో పనిచేసిన కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు, బొత్స సాయి గురు నాయుడు, సందీప్, అనూష, మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕