పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం గజపతినగరంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కలిగి పండు, పైల మహేష్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్