పవన్ కళ్యాణ్ జన్మదినం: ముడిదాంలో ఉచిత వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా, విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ముడిదాం గ్రామ పంచాయతీ జనసైనికుల ఆధ్వర్యంలో, శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఆరోగ్య పరిరక్షణపై వైద్యులు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్