ఆస్తి తగాదా: అన్నదమ్ముల మధ్య ఘర్షణ, ఇద్దరికి తీవ్ర గాయాలు

విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం కొండకిండం గ్రామంలో సోమవారం ఆస్తి తగాదా కారణంగా ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కలిశెట్టి గౌరినాయుడు కత్తితో దాడి చేయడంతో కలిశెట్టి సత్యనారాయణ, కలిశెట్టి బంగారు నాయుడులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్