వ్యర్ధాలు అందించండి బహుమతులు పొందండి

ప్రజలు వ్యర్థాలను అందించి బహుమతులు పొందాలని బొండపల్లి ఎంపీడీవో రఘుపతిరావు కోరారు. శుక్రవారం దసరా మహోత్సవాలు పురస్కరించుకొని రాచకిండాం గ్రామంలో ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు బహుమతులను అందజేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ సూచనల మేరకు స్వచ్ఛరథం ప్రతి గ్రామంలో తిరుగుతున్నట్లు తెలిపారు. వ్యర్థాలకు నిత్యవసర సరుకులతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా అందిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕