మెంటాడ మండలం ఆండ్ర గిరిజన గ్రామంలో మంగళవారం శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న పింఛన్లను పంపిణీ తీరును పరిశీలించారు. అనంతరం ఆండ్ర గ్రామంలో నిర్వహించిన సభలో లోతుగెడ్డ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సారా భీమారావు తన అనుచరులు 100 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి సంధ్యారాణి సర్పంచ్ ను టీడీపీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.