గజపతినగరం సబ్ పోస్ట్ మాస్టర్ పి అప్పలకృష్ణ ప్రజలకు ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్యాంపులు 8, 9 తేదీలలో ప్రతిభ జూనియర్ కళాశాల వద్ద, 10, 11 తేదీలలో భవిష్య జూనియర్ కళాశాల వద్ద, 13, 14 తేదీలలో శ్రీకృష్ణ జూనియర్ కళాశాల వద్ద, 15, 16 తేదీలలో సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాల వద్ద జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.