ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవ కా అభయాన్ లో భాగంగా గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును బిజెపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని సందర్శించారు. ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ప్రధాని మోదీని ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్, మండల పార్టీ అధ్యక్షుడు మేటుకోటి భాస్కరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు, ఈశ్వరరావు, తౌడు తదితరులు పాల్గొన్నారు.