స్థానిక సంస్థల ఎన్నికలలో సమిష్టిగా పనిచేయాలి

స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. శనివారం దత్తిరాజేరులో మండల వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీకి కార్యకర్తలే కీలకమని ప్రతి కార్యకర్తను పార్టీ సంస్థ గత నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలు ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕