జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: ఏపీడబ్ల్యూజేఎఫ్

విజయనగరం జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆంధ్రపద్రశ్ వర్కింగ్ జరల్నిలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శివకేశవనాయుడు, పి. అప్పారావు తెలిపారు. ఎపిడబ్ల్యుజెఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం జడ్పీ మినిస్టీరియల్ హాలులో ఉపాధ్యక్షుడు పతివాడ రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు చేశారు. నియోజకవర్గాల వారీ సమావేశాలు నిర్వహించి, జర్నలిస్టుల సమస్యలపై కార్యాచరణ చేపట్టాలని, ప్రధానంగా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పోరాడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕