ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం డోలపాలెం గ్రామానికి చెందిన వాస చిలకమ్మ చిన్న కుమార్తె వాసా దేవి కడుపునొప్పి తాళలేక ఈనెల 25వ తేదీన మోతాదుకు మించి ఐరన్ మాత్రలు తీసుకుంది. దీంతో దేవిని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్సకు విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దేవి ఆక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕