విజయనగరంలో పేద కుటుంబానికి యువత చేయూత.. నిత్యవసరాల పంపిణీ

విజయనగరం పట్టణంలోని అశోక్ నగర్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఒక నిరుపేద కుటుంబానికి విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు అండగా నిలిచారు. ఇటీవల అనారోగ్యంతో కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం దుఃఖంలో ఉండగా, విషయం తెలుసుకున్న రాయల్ క్యాబ్ శరత్, సురేష్ తదితరులు స్పందించారు.   గురువారం ఆ కుటుంబానికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ మానవతా కార్యక్రమం లో అజయ్ కుమార్, అచ్చిబాబు, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕