బద్దిడిలో ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమం

కొమరాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గిరిశిఖర గ్రామమైన బద్దిడిని పార్వతీపురం రూరల్ సిఐ రంఘనాధం, కొమరాడ ఎస్సై జగదీశ్ నాయుడు, తహసీల్దార్ చిన్నారావు, వైద్యాధికారి సందర్శించారు. “ఇంటింటికీ మన్యం పోలీస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు అక్కడి ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాలు, మహిళలు–చిన్నారుల పై నేరాలు, రోడ్ సేఫ్టీ, కౌమార దశలో గర్భం తదితర అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్