కురుపాం మండల కేంద్రంలో ఉన్న రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలను ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డిపోలో ఉన్న రేషన్ సరుకులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పౌష్టికాహారం లోపం లేకుండా సక్రమంగా అందించాలని సిబ్బందికి సూచించారు.