మన్యం జిల్లా కొమరాడ మండలం అర్థాం సోమినాయుడు వలస గ్రామంలో మంగళవారం రైల్వే గేట్ల సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న కొప్పర వెంకటరమణ (26)ను వేగంగా వచ్చిన గుర్తు తెలియని రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు జీఆర్పీ రత్నాకర్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.