గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా కుస గ్రామ సమీపంలోని సహజ సిద్ధ జలపాతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. నిన్న జలపాతాల సందర్శనకు వచ్చిన మంత్రి సంధ్యారాణి ఇచ్చిన హామీ మేరకు పర్యాటకుల రాకపోకలకు వీలుగా ఈ బస్సును ప్రారంభించినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో పర్యాటకం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు తేజోవతి కూడా పాల్గొన్నారు.