పార్వతీపురం: అనారోగ్యంతో తనువు చాలించిన గిరిజన విద్యార్థి

కురుపాం మండలం గొల్లగానిగూడకు చెందిన ఆరిక జీవన్ కుమార్ (20) అనే డిగ్రీ విద్యార్థి సికిల్ సెల్ ఎనీమియా, మలేరియా, వాంతులు, పొట్ట ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతిచెందాడు. భద్రగిరి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం, బుధవారం జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూనే మరణించాడు. డిగ్రీ పూర్తి చేసి కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశించిన తల్లిదండ్రులు కుమారుడి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

సంబంధిత పోస్ట్