మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు..తల్లికొడుకు క్షేమం

కురుపాం పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. బియ్యాలవలసకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లి తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు, సాంకేతిక ఆధారాల సహాయంతో వారిని క్షేమంగా గుర్తించారు. గురువారం వారిని కురుపాం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్