అధికారులు మారుతున్నారే తప్ప.. ప్రజా సమస్యలు పరిష్కరించట్లేదు

కొమరాడ మండల తాసిల్దార్ కార్యాలయంలో నెలకో ఎమ్మార్వో మారుతున్నా, సామాన్యుల సమస్యలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేక ప్రజలు విసుగు చెందుతున్నారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ గంగాధర్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం, కురుపాం ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్