కొమరాడ మండలంలో కొరిశీల, కెమిసీల గ్రామాల మధ్య రహదారి నిర్మాణం కోసం కాంట్రాక్టర్ తీసుకువచ్చిన 200 చైన్ మిషన్ అగ్నికి ఆహుతి అయిన ప్రాంతాన్ని పార్వతీపురం సీఐ రవికుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ పరిశీలనలో ఎస్సై నీలకంఠం తదితరులు ఉన్నారు.