విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామంలో శనివారం అంగన్వాడి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుర్లే శ్రీధర్, మండల అధ్యక్షుడు మైపాడ ప్రసాద్ పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని శ్రీధర్ ఈ సందర్భంగా తెలిపారు. అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు ఈ పోషకాహార అవగాహనలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఉత్సవాలు అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను, పోషకాహార అవసరాన్ని తెలియజేశాయి.