భోగాపురం మండలంలోని సవరవల్లి, ఉప్పాడ పేట, రావాడ, బసవపాలెం, తూడెం, కవులవాడ పరిధిలో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని ఏఈ మస్తాన్ వలీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.