ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' ద్వారా ప్రజల విజయాలు, సామాజిక అంశాలు, వినూత్న ప్రయత్నాల గురించి తెలియజేస్తారు. స్వదేశీ ఉత్పత్తులు, పరిశుభ్రత, విద్య, క్రీడలు, యువత వంటి అంశాలపై ఆయన మార్గ నిర్దేశం చేశారు. ఈ ప్రసారాన్ని ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల గాంధీ నగర్ కాలనీలో బీజేపీ నాయకులు దుర్గాసి త్రినాధ రావు, భారతి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎన్ నారాయణమూర్తి వీక్షించారు.