డెంకాడ: తప్పిన పెను ప్రమాదం

డెంకాడ మండలంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. భోగాపురం నుండి నలుగురు వ్యక్తులు తమ కారులో శ్రీకాకుళం వెళ్తున్న నేపథ్యంలో డెంకాడ మండలం నాతవలస టోల్ గేట్ వద్ద ఫాస్ట్ ట్రాక్ కోసం కారు దిగి వెళ్లారు. ఈ మేరకు కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయిందని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్